ఆదివారం 5 డిసెంబర్ 2010

చెంగల్వపువ్వులు.

చేతవెన్న ముద్ద" చెంగల్వ పూదండ"
బంగారుమొలత్రాడు పట్టుదట్టి
సందెతాయెతులు సరిమువ్వగజ్జెలు
చిన్నికృష్ణా ! నిన్ను చేరికొలుతు.









12 వ్యాఖ్యలు:

  1. ఇవా చెంగల్వలంటే? ఎర్రకలువలు అనుకున్నా!
    ఇవి ఒక విధమైన లిల్లీలు - ఈ పూలు చిన్నప్పుడూ మా యింట్లో ఉండేవి.

    ప్రత్యుత్తరంతొలగించు
  2. ఇవి చెంగల్వ పూల? వీటిని వాటర్ లిల్లీస్ అంటారు కదా! మా ట్యుషన్ సార్ వాళ్లింట్లో బోలెడు ఉంటాయి.వీటితో చేసిన దండనా కృష్ణుడు వేసుకునేది!! భలే ఉన్నయ్ :)

    ప్రత్యుత్తరంతొలగించు
  3. నేనూనూనూనూ, చెంగలువలు అంటే కెంపు + కలువలు - కెంగలువలు - చెంగలువలు - అయిన కెంపు కలువలు అనుకున్నాను. మనూరిలో ఎఱ్ఱకలువలు ఎక్కడివా అనుకున్నాను.
    వీటిని చెంగలువలు అంటారంటే నాకు చాలా ఆశ్చర్యంగావుంది. వీటిలోనే ఎఱ్ఱగావుండేవాటిని అంటారేమో లేకపోతే. ఏమైతేనే పువ్వులు బాగున్నాయి.

    ప్రత్యుత్తరంతొలగించు
  4. వీటిని చెంగలువ పువ్వులంటారా ? ఎప్పుడూ చూస్తూ వుంటాను కాని వీటినే చెంగలువ అంటారని తెలీదు . బాగున్నాయి .

    ప్రత్యుత్తరంతొలగించు
  5. ఇవా చెంగల్వపూలు? నేనూ కలువపూవులనే అనుకున్నా. పూలు చాలా బావున్నాయి ముద్దుగా మురిపిస్తూ.

    ప్రత్యుత్తరంతొలగించు
  6. @కొత్తపాళి,ఇందు,నాకు తెలిసి మా వైపు వీటిని చెంగల్వ అనే అంటారండి..ధన్యవాదాలు..
    @రాకేశ్వర రావు,నీకూ వీటిని చెంగల్వలు అంటారని తెలిదా??మనూరికి వచ్చినప్పుడు ఎవరినైనా అడుగు...ధన్యవాదాలు.
    @మాలాకుమార్,సౌమ్య ధన్యవాదాలు.

    ప్రత్యుత్తరంతొలగించు
  7. వీటిని బొంబాయి లిల్లీలంటారు కదా...

    ప్రత్యుత్తరంతొలగించు
  8. మరి ఇవి... http://chilamakuru.blogspot.com/2009/04/blog-post_28.html

    ప్రత్యుత్తరంతొలగించు
  9. జ్యోతి గారు వీటికి ఇన్నిరకాల పేర్లున్నాయని ఇప్పుడే తెలిసిందండి.నాకైతే అవి చెంగల్వ లానే తెలుసండి.
    విజయ్ మోహన్ గారి బ్లాగ్లో పువ్వులను ఎర్ర లిల్లీలు అంటాము. .ఈ లింక్ చూడండి.
    http://palleturipaduchu.blogspot.com/2010/04/blog-post_8199.html

    ప్రత్యుత్తరంతొలగించు
  10. ఒక విన్నపం - మీకు ఎక్కడన్నా పుచ్చ పువ్వులు కనబడితే ఫొటో పెట్టరూ?

    ప్రత్యుత్తరంతొలగించు
  11. ivi idivaraku maa intlo undevi baga gongaleelu patti tinesaayi nice pics

    ప్రత్యుత్తరంతొలగించు